ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై డిసెంబర్ 3న దేశవ్యాప్త సమ్మె

ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు నిరసనగా డిసెంబర్ 3న దేశమంతటా సమ్మె చేయాలని ఉద్యోగులు, అధికారుల సంఘాలు నిర్ణయించాయి. బ్యాంక్‌లో కేంద్రం, ఎల్‌ఐసీకి ఉన్న మెజారిటీ వాటాను కెనడా సంస్థ ఫెయిర్‌ఫాక్స్‌కు అమ్మే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని అవి డిమాండ్ చేశాయి. సిబ్బంది ఉద్యోగ భద్రత, ప్రయోజనాలతో పాటు రిజర్వేషన్ నిబంధనలకు రక్షణ కల్పించాలని కోరాయి.
✓ Verified