యూపీలో కాంగ్రెస్‌కు 181 సీట్లు కావాలి.. జాబితా బయటకు

ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుపై సంప్రదింపులు జరుపుతున్న కాంగ్రెస్ 181 సీట్లు అడుగుతోందని తెలిపే జాబితా బయటకు వచ్చింది. అందులో 131 జనరల్, 45 ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వుడు సీటు ఉన్నాయి. రాయ్‌బరేలీ, అమేథీ, వారణాసి, గోరఖ్‌పూర్ వంటి ప్రాంతాలపై ఆ పార్టీ గురిపెట్టిందని సమాచారం. దీంతో సీట్ల పంపకంపై అఖిలేశ్ యాదవ్‌కు ఒత్తిడి పెరిగింది.
✓ Verified