ఏడు షరతులు ఒప్పుకుంటేనే అమెరికాతో చర్చలు: ఇరాన్ స్పీకర్

అమెరికా తమ ఏడు షరతులను అంగీకరించకపోతే చర్చలకు వచ్చేది లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘ్హర్ తేల్చిచెప్పారు. హర్మూజ్ జలసంధిలో అమెరికా రక్షణలో ఉన్న మూడు చమురు ట్యాంకర్లు సీమైన్లతో మునిగిన ఘటనను ప్రస్తావించారు. వైఖరి మారకుంటే అలాంటివి మళ్లీ జరుగుతాయని హెచ్చరించారు. ఆంక్షల ఎత్తివేత, ఓడరేవుల దిగ్బంధం తొలగింపు, ఆస్తుల అప్పగింత షరతుల్లో ఉన్నట్లు సమాచారం.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Ram Charan to turn villain in Sukumar's film?
Ram Charan may finally be seen as the villain in his new film with director Sukumar, according to buzz in Film Nagar. The project is said to be a psychological thriller, with Charan playing a man with mental health issues. The story reportedly reveals the antagonist within the hero towards the end. The team has not responded officially.
సుకుమార్ చిత్రంలో విలన్‌గా రామ్ చరణ్?
దర్శకుడు సుకుమార్‌తో రామ్ చరణ్ చేయబోయే కొత్త సినిమాలో ఆయన చివరకు ప్రతినాయకుడిగా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని, చరణ్ మానసిక సమస్యలతో బాధపడే పాత్ర పోషిస్తారని సమాచారం. క్లైమాక్స్‌లో హీరోలోని విలన్ కోణం బయటపడేలా కథ సిద్ధమవుతోందట. ఈ ప్రచారంపై చిత్రబృందం ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు.
Karthika Mahadeepam lit atop Yogula Parvatham near Appalayagunta
The Karthika Mahadeepotsavam was held grandly on Yogula Parvatham near Appalayagunta in Vadamalapeta mandal of Tirupati district. The giant lamp was lit in a six-foot cauldron filled with 1,008 kg of cow ghee, using a 1,503-metre-long wick. Thousands of devotees from AP, Tamil Nadu and Karnataka gathered to witness it.
యోగుల పర్వతంపై వెలిగిన కార్తిక మహాదీపం
తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట దగ్గర ఉన్న యోగుల పర్వతంపై కార్తిక మహాదీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరు అడుగుల కొప్పెరలో 1,008 కిలోల ఆవు నెయ్యి నింపి, 1,503 మీటర్ల వత్తితో దీపం వెలిగించారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఏపీ, తమిళనాడు, కర్ణాటకల నుంచి వేలాదిగా భక్తులు వచ్చారు.
Free schooling for Singareni contract workers' children
Children of Singareni contract workers will now get free education up to Class 10 in the company's educational institutions. The management took the decision following orders from the state government. Families of around 30,000 contract workers employed across the company's 12 areas are set to benefit from the move.
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు ఉచిత విద్య
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పిల్లలు ఇకపై సంస్థ విద్యాసంస్థల్లో పదో తరగతి దాకా ఉచితంగా చదువుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు యాజమాన్యం ఈ నిర్ణయం ప్రకటించింది. సంస్థ పరిధిలోని 12 ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 30 వేల మంది ఒప్పంద కార్మికుల కుటుంబాలు దీనివల్ల లబ్ధి పొందనున్నాయి.