కడెం ప్రాజెక్ట్ కుడి ఎడమ కాలువల ద్వారా సాగు నీటి నిలిపివేత (Video)
నిర్మల్ జిల్లా,కడెం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా విడుదలవుతున్న సాగునీటిని నీటి పారుదల శాఖ అధికారులు నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 3.495 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.748 టీఎంసీలుగా ఉంది. ఎగువ ప్రాంతం నుండి 46 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఈఈ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టులో సరిపడేంత నీరు లేకపోవడంతో త్రాగునీటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అందుకోసమే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాగునీటిని నిలిపివేసినట్లు వారు పేర్కొన్నారు.
✓ Verified