రామోజీరావు సమాచార సంపదకు ఆశ్చర్యపోయా: అమిత్ షా

విజయవాడలో జరిగిన రామోజీ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. రామోజీ గ్రూప్ ఎన్నో సేవలు అందిస్తోందని కొనియాడారు. ఒకసారి తన కారు నిలిచిపోగా రామోజీరావు తన వాహనంలో ఎక్కించుకున్నారని, అలా పరిచయమైందని గుర్తుచేసుకున్నారు. తర్వాత నాలుగుసార్లు కలిశానని, యూపీ ఎన్నికల సమయంలో ఆయన దగ్గరున్న సమాచారం తనను విస్మయపరిచిందని చెప్పారు.
✓ Verified