బట్టతలకు చెక్ పెట్టే ఎలక్ట్రిక్ దువ్వెన రూపొందించిన చైనా

బట్టతల సమస్య పరిష్కారానికి చైనా పరిశోధకులు కొత్త ఎలక్ట్రిక్ దువ్వెనను తయారు చేశారు. బీజింగ్‌లోని బెహాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన ‘డిటాంగిల్’ పరికరం స్వల్ప విద్యుత్ ప్రేరణల ద్వారా కేశకుదుళ్లను చురుగ్గా మారుస్తుంది. ఎలుకలపై చేసిన పరీక్షల్లో 28 రోజుల్లోనే కొత్త వెంట్రుకలు వచ్చాయని తేలింది. మనుషులపై ఇప్పటివరకు పరీక్షలు చేయలేదు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Nations must work together for peace, says PM Modi
Prime Minister Narendra Modi urged all countries to work collectively for peace, stability and a predictable global environment. Addressing the ASEAN-India summit, he said the world has been facing several crises over the past few years.
శాంతి కోసం దేశాలన్నీ కలిసి పనిచేయాలి: ప్రధాని మోదీ
శాంతి, స్థిరత్వం, అంచనా వేయగల ప్రపంచ వాతావరణం సాధించేందుకు దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. కొన్నేళ్లుగా ప్రపంచం ఎన్నో సంక్షోభాలతో సతమతమవుతోందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.
Jagan questions govt over fee reimbursement figures
YSRCP chief and former CM YS Jagan alleged that the coalition government's figures on fee reimbursement payments do not match the facts. Attacking the Andhra Pradesh government, he claimed Chandrababu Naidu and Lokesh are setting records in telling lies and deceiving the people.
ఫీజు రీయింబర్స్‌మెంట్ లెక్కలపై కూటమి సర్కార్‌ను నిలదీసిన జగన్
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వాస్తవాలతో సరిపోవడం లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని ఆయన తప్పుబట్టారు. అసత్యాలు పలకడంలో, ప్రజలను వంచించడంలో చంద్రబాబు, లోకేశ్ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారని జగన్ దుయ్యబట్టారు.
Cyclone Akwan: Dial 1912 to report power line damage
Minister Gottipati Ravikumar urged people in Andhra Pradesh to call 1912 if electricity poles collapse or wires snap during Cyclone Akwan. He said the power department has been put on alert and special control rooms set up to offer immediate help. He cautioned the public to keep away from fallen wires.
అక్వాన్ తుపాను: విద్యుత్ సమస్యలపై 1912కు ఫోన్ చేయాలి
రాష్ట్రంలో అక్వాన్ తుపాను నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు పడిపోయినా, తీగలు తెగిపోయినా 1912 నంబరుకు తెలియజేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజలను కోరారు. తుపానును ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ సిబ్బందిని సన్నద్ధం చేశామని, తక్షణ సహాయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు పెట్టామని చెప్పారు. తెగిన తీగల దగ్గరికి వెళ్లొద్దని ఆయన జాగ్రత్తలు చెప్పారు.