సీట్ల పంపకాలపై ఎస్పీ నలుగురు సభ్యుల కమిటీ

సీట్ల పంపకాలపై చర్చించేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నలుగురు సభ్యులతో కమిటీని నియమించారు. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని మిగతా పక్షాలతో ఎస్పీ సంప్రదింపులు జరపనుంది. ఈ నెల 23, 24 తేదీల్లో దిల్లీ వేదికగా భేటీలు ఉంటాయని తెలుస్తోంది. 2027 ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
✓ Verified