మున్సిపల్ ఎన్నికల ఫలితాలను న్యూస్డాష్ యాప్‌లో ప్రత్యక్షంగా చూడొచ్చు. మెనూలో "ఎన్నికలు"పై నొక్కి మీ పట్టణం పేరు ఇంగ్లీష్‌లో వెతకండి. ప్రతి వార్డు అభ్యర్థులు, రిజర్వేషన్, ఆధిక్యం, గెలుపు వివరాలు 30 సెకన్లకోసారి అప్డేట్ అవుతాయి. newsdashapp.com/elections లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
ఎన్నికలు జరిగిన 13 కార్పొరేషన్లలో గ్రేటర్ విశాఖపట్నం అతిపెద్దది. ఇక్కడ 120 వార్డులు ఉండగా మేయర్ పీఠానికి 61 సీట్లు అవసరం. విజయవాడలో 86 (మెజారిటీ 44), గుంటూరులో 76 (39), నెల్లూరులో 72 (37), కర్నూలులో 68 (35) వార్డులు ఉన్నాయి. కడప, తిరుపతిలో చెరో 66 వార్డులు ఉన్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో 700కు పైగా వార్డులు ఏకగ్రీవమైనట్లు సమాచారం. మొత్తం 3,942 వార్డుల్లో మిగిలిన వాటికి నవంబర్ 1న పోలింగ్ జరిగింది. అధికారిక ఏకగ్రీవ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది. ప్రతి వార్డు ఫలితం, అభ్యర్థుల వివరాలను న్యూస్డాష్లో మీ పట్టణం పేజీలో చూడొచ్చు.
ఓట్ల లెక్కింపునకు ముందే 17 మున్సిపాలిటీల చైర్పర్సన్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వీటిలో 15 టీడీపీ, ఒకటి జనసేన (దర్శి), ఒకటి బీజేపీ (ఎర్రగుంట్ల) ఖాతాలో చేరాయి. ప్రొద్దుటూరు, నగరి, పుంగనూరు, రాయచోటి, బద్వేలు, గుత్తి తదితర పట్టణాలు ఈ జాబితాలో ఉన్నాయి.
రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం (నవంబర్ 3) ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లోని మొత్తం 3,942 వార్డుల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నెల 1న పోలింగ్ జరిగింది. ఫలితాలను న్యూస్డాష్ యాప్‌లో ప్రత్యక్షంగా చూడొచ్చు.