యూకేను వీడినవారిలో భారతీయులే అగ్రస్థానం

యూకే నుంచి వెళ్లిపోయిన వీసాదారుల్లో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. 2025 జులై నుంచి 2026 జూన్ వరకు 85 వేల మంది భారతీయులు ఆ దేశాన్ని విడిచారని ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్’ గణాంకాలు వెల్లడించాయి. వీరిలో 55 వేల మంది విద్యార్థులు, 28 వేల మంది ఉద్యోగులు, రెండు వేల మంది ఇతర వీసాదారులు. 51 వేల మందితో చైనా రెండో స్థానంలో ఉంది. కొత్తగా యూకే వెళ్లేవారిలోనూ భారతీయులే ముందున్నారు.
✓ Verified