22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
ఏపీలో బియ్యం ధరలు ఖరారు.. ఎంటీయూ రకం కిలో రూ.47ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ స్థాయి గౌరవం ఇవ్వాలి: లోకేశ్ఐ-అలర్ట్‌తో టీజీఎస్‌ఆర్టీసీకి రూ.36 కోట్ల డీజిల్ ఆదాపంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులకు స్వేచ్ఛ: పవన్‌ కల్యాణ్‌విశాఖలో ఏషియన్-ఇండియా మారిటైమ్ సదస్సు, 12 దేశాల ప్రతినిధులుక్వాంటమ్ వ్యాలీగా అమరావతి: నీలిట్ వర్సిటీ క్యాంపస్ షురూ

స్థానిక సమస్యలు

10వ వార్డులో మిగిలిన 10 మంది అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలి (Video)

తంగళ్ళపల్లిరచన CHERUKUPALLY RAKESHధృవీకరించిన Newsdash రిపోర్టర్, Newsdash reporter

షేర్:WhatsAppXFacebook

సిరిసిల్ల 10వ వార్డులో అర్హులైన మరో 10 మంది నిరుపేదలకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని కౌన్సిలర్ బోల్గం వైష్ణవి నాగరాజ్ డిమాండ్ చేశారు. 39 మంది దరఖాస్తు చేసుకోగా 27 మందికి మాత్రమే పెన్షన్లు వచ్చాయని, ఇద్దరికి తాజాగా మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన 10 మంది సమస్యలను పరిష్కరించాలని కోరారు. శాశ్వత వైకల్య ధ్రువీకరణ ఉన్న ఐలయ్యకు పెన్షన్ ఇవ్వాలని, వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిరుపేదల పక్షాన నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 22 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తంగళ్ళపల్లి

మరిన్ని →

శాతవాహన వర్సిటీ ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలి (Video)

శాతవాహన విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు వెంటనే స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. అన్ని కోర్సుల్లో ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. విశ్వవిద్యాలయ పరిరక్షణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

తంగళ్ళపల్లి ·

మూతపడే స్థితిలో ఉన్న డిగ్రీ కళాశాలకు కవిత రూ.1.30 లక్షల ఆర్థిక సాయం (Video)

ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిరక్షణకు ఎమ్మెల్సీ కవిత ఆర్థిక చేయూత అందించారు. శాతవాహన యూనివర్సిటీకి చెల్లించాల్సిన ఫీజు బకాయిలు రూ.1,30,800ను చెల్లించి కళాశాలకు అండగా నిలిచారు. కళాశాల పరిరక్షణ సభ్యుడు రంజిత్ సమస్యను టీఆర్ఎస్ సిరిసిల్ల ఇంచార్జ్ మజీద్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కవితకు వివరించారు. స్పందించిన కవిత ఆర్థిక సహాయం అందించడంతో ప్రిన్సిపాల్ శంకర్ అధ్యాపకులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

తంగళ్ళపల్లి ·