Vaibhav's 52-ball double ton powers India A into semi-finals

Vaibhav Suryavanshi set the record for the fastest double century in List-A cricket, reaching 200 in just 52 balls against the UAE in the Asia Cup Rising Stars ODI tournament. He made 204 off 53 balls as India A chased 250 in 14.2 overs, losing 3 wickets, to win by 7 wickets and reach the semi-finals.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Jana Sena's Sirisha elected Atmakur municipal vice chairperson
Jana Sena candidate Kolagani Sirisha won the Atmakur municipal vice chairperson post in Nellore district on Tuesday, backed by 17 councillors. Earlier, Minister Anam had given the post to another councillor, but Monday's election was cancelled after Deputy CM Pawan Kalyan intervened, ending days of suspense.
ఆత్మకూరు మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా జనసేన నేత శిరీష
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ వైస్ ఛైర్పర్సన్ పదవిని జనసేన అభ్యర్థి కొలగాని శిరీష దక్కించుకున్నారు. మంగళవారం జరిగిన ఎన్నికలో 17 మంది కౌన్సిలర్లు ఆమెకు అండగా నిలిచారు. అంతకుముందు మంత్రి ఆనం ఈ పదవిని వేరే కౌన్సిలర్‌కు ఇవ్వగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవడంతో సోమవారం జరిగిన ఎన్నిక రద్దయింది.
Gold bond investors gain about ₹7,885 per gram
Investors in Sovereign Gold Bonds 2021-22 Series-I stand to gain about ₹7,885 per gram. RBI fixed November 25 as the premature redemption date and set the price at ₹12,612 per gram. At issue, offline buyers paid ₹4,777 per gram, while online buyers got a ₹50 discount, paying ₹4,727.
గోల్డ్ బాండ్లపై గ్రాముకు సుమారు ₹7,885 లాభం
సావరిన్ గోల్డ్ బాండ్ల 2021-22 సిరీస్-I మదుపర్లకు గ్రాముపై దాదాపు రూ.7,885 లాభం దక్కనుంది. వీటి ముందస్తు ఉపసంహరణ తేదీని నవంబర్ 25గా ఆర్బీఐ ప్రకటించింది. గ్రాము విలువను రూ.12,612గా ఖరారు చేసింది. జారీ సమయంలో ఆఫ్‌లైన్ కొనుగోలుదారులకు గ్రాము ధర రూ.4,777 ఉండగా, ఆన్లైన్లో రూ.50 రాయితీతో రూ.4,727కే లభించింది.
Naga Chaitanya treks Ramagiri Fort to promote 'Vrushakarma
Actor Naga Chaitanya trekked up Ramagiri Fort in Peddapalli district as part of promotions for his film 'Vrushakarma'. He toured the ancient fort, known for its seven huge gateways, temples and cannons, with YouTuber Justy. The video showcasing its heritage and scenery releases on November 27, while the film hits theatres on December 4.
రామగిరి ఖిల్లాపై నాగచైతన్య ట్రెక్కింగ్
నటుడు నాగచైతన్య పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లాపై ట్రెక్కింగ్ చేశారు. ‘వృషకర్మ’ సినిమా ప్రచారంలో భాగంగా యూట్యూబర్ జస్టితో కలిసి ఈ పురాతన కోటను చుట్టొచ్చారు. ఏడు పెద్ద ద్వారాలు, ఆలయాలు, ఫిరంగులున్న ఖిల్లా విశేషాలు, ప్రకృతి సోయగాలతో రూపొందిన వీడియో నవంబర్ 27న రానుంది. సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది.