ఉర్రాడ సమీపంలో కారు ప్రమాదం.. సైడ్‌వాల్ ధ్వంసం (Video)
హుకుంపేట: అరకు నుంచి పాడేరు వైపు వస్తున్న కారు మంగళవారం ఉర్రాడ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సైడ్‌వాల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైడ్‌వాల్ పూర్తిగా ధ్వంసం కాగా, కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదం అనంతరం పరారైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
✓ Verified