సిరాజ్‌కు 2027 ప్రపంచకప్‌లోనూ చోటు కష్టమే: అశ్విన్

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు తుది జట్టులో పేసర్ సిరాజ్‌కు స్థానం దక్కకపోవడంపై మాజీ స్పిన్నర్ అశ్విన్ స్పందించాడు. అతడిని పక్కనపెట్టేందుకు నెల రోజులుగా ప్రణాళిక సాగుతోందన్నాడు. ఇటీవల వన్డేల్లోనూ అవకాశం ఇవ్వలేదని, ఇది ట్రైలర్ మాత్రమేనని, 2027 ప్రపంచకప్‌కూ సిరాజ్ ఎంపిక కాకపోవచ్చని పేర్కొన్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో అతడు బాగా రాణించాడని గుర్తుచేశాడు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Travis Kalanick vows protest at Nvidia HQ backing Jensen Huang
Uber co-founder Travis Kalanick has announced he will stage a protest at Nvidia's headquarters in support of Jensen Huang, as calls grow to reinstate Huang as Nvidia CEO. He said he would join employees, other businesspeople and tech leaders in the agitation, and likened Huang's situation to his own exit from Uber in 2017.
జెన్సన్కు మద్దతుగా నిరసనకు సిద్ధమన్న ట్రావిస్ కలానిక్
ఎన్విడియా ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన చేపడతానని ఉబర్ సహ-వ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్ ప్రకటించారు. జెన్సన్ హువాంగ్ను తిరిగి సీఈఓగా నియమించాలనే డిమాండ్ ఊపందుకుంటున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, టెక్ దిగ్గజాలతో కలిసి జెన్సన్కు అండగా ఆందోళనకు దిగుతానన్నారు. 2017లో ఉబర్ నుంచి తాను వైదొలగిన సందర్భంతో జెన్సన్ పరిస్థితిని పోల్చారు.
Cyclone Akwan makes landfall near Gopalpur, heavy rain in North Andhra
Cyclone Akwan, which formed in the Bay of Bengal, crossed the coast near Gopalpur in Odisha, the India Meteorological Department said. Strong winds of 70 to 80 kmph lashed the region during landfall, and the process will continue for two more hours. Very heavy rain is pounding North Andhra districts, and officials have launched relief measures.
గోపాల్పూర్ వద్ద తీరం దాటిన 'అక్వాన్' తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తుపాను ఒడిశాలోని గోపాల్పూర్ దగ్గర తీరాన్ని దాటిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు బలంగా వీచాయి. ఈ ప్రక్రియ ఇంకో రెండు గంటలు సాగుతుందని శాఖ పేర్కొంది. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోత వానలు పడుతుండగా, అధికారులు అప్రమత్తమై సహాయ చర్యలు ముమ్మరం చేశారు.
Sharwanand's 'Bhogi' to hit screens on November 27
Sharwanand's periodic action drama 'Bhogi', directed by Sampath Nandi, will release worldwide on November 27. The film was earlier planned for August 28 and then November 12, but was postponed due to censor issues. Sharwanand plays the role of 'Ganga', while Anupama Parameswaran and Dimple Hayathi are the heroines.
శర్వానంద్ ‘భోగి’ నవంబర్ 27న థియేటర్లలోకి
శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మొదట ఆగస్టు 28, తర్వాత నవంబర్ 12 తేదీలను అనుకున్నప్పటికీ సెన్సార్ ఇబ్బందుల కారణంగా విడుదల ఆలస్యమైంది. ఇందులో శర్వానంద్ ‘గంగ’గా కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలు.