
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలోని మొత్తం 32 వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీటిలో టీడీపీ 22, వైఎస్ఆర్ కాంగ్రెస్ 8, జనసేన 2 వార్డులు గెలుచుకున్నాయి. స్పష్టమైన మెజారిటీ సాధించిన టీడీపీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం జరిగిన ఎన్నికలో చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.