చరిత్రలో నవంబర్ 11: మౌలానా ఆజాద్ జయంతి

స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888లో నవంబర్ 11న పుట్టారు. భారత్‌లో ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా గుర్తిస్తారు. ఇదే తేదీన 1918లో మొదటి ప్రపంచ యుద్ధానికి తెరపడింది. 1975లో పోర్చుగల్ పాలన నుంచి విముక్తి పొంది అంగోలా స్వతంత్ర దేశంగా అవతరించింది.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →చిలికా సరస్సు: ఆసియాలోని పెద్ద ఉప్పునీటి సరస్సుల్లో ఒకటి
ఆసియాలోని భారీ ఉప్పునీటి సరస్సుల జాబితాలో ఒడిశాలోని చిలికా సరస్సు ఒకటిగా నిలుస్తోంది. ఏటా చలికాలంలో సైబీరియా, మధ్య ఆసియా వంటి దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వలస పక్షులు ఇక్కడికి చేరుకుంటాయి. అరుదైన ఇరావడి డాల్ఫిన్లు కూడా ఈ సరస్సులో దర్శనమిస్తాయి. 1981లో దీనికి అంతర్జాతీయ ప్రాధాన్యం గల రాంసర్ తడి నేల హోదా దక్కింది.
నేటి జీకే ప్రశ్నలు: కార్బెట్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
కార్బెట్ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్‌లో ఉంది. చిప్కో ఉద్యమం అడవుల పరిరక్షణకు సంబంధించినది. థార్ ఎడారి ఎక్కువ భాగం రాజస్థాన్‌లో విస్తరించింది. దేశంలో పొడవైన హిమాలయ శ్రేణి హిమాద్రి. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని గోపాలకృష్ణ గోఖలే స్థాపించారు. ఇవీ 11/11/2026 నాటి ప్రశ్నలకు సమాధానాలు.
సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రానికి రేపు పూజ
హీరో సిద్దు జొన్నలగడ్డ నటించనున్న కొత్త చిత్రం రేపు పూజా కార్యక్రమంతో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. సుకుమార్ రైటింగ్స్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బన్నీ వాస్ నిర్మిస్తుండగా, అశోక్ బండ్రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా వివరాలను సిద్దు స్వయంగా ఎక్స్‌లో పంచుకున్నారు.
Siddu Jonnalagadda's new film to launch with pooja tomorrow
Actor Siddu Jonnalagadda's new film will be launched with a pooja ceremony tomorrow, the film unit announced. The project is being made in partnership with Sukumar Writings, produced by Bunny Vas and directed by Ashok Bandreddy. Siddu shared the news about the film on X.
Scrap big notes to curb corruption, says CM Chandrababu Naidu
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu said demonetisation of high-value notes is necessary to control corruption. He said only notes of up to Rs.200 should remain in the market. The CM urged people to shift towards using digital currency instead of cash. His remarks have triggered discussion.
ఏపీపీఎస్సీ గ్రూప్-2: 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 కింద మొత్తం 720 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ విభాగంలో 471, నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 249 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రక్రియ ఈరోజు నుంచే మొదలైంది. నిరుద్యోగులు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరారు.