నేటి జీకే ప్రశ్నలు: కార్బెట్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?

కార్బెట్ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్‌లో ఉంది. చిప్కో ఉద్యమం అడవుల పరిరక్షణకు సంబంధించినది. థార్ ఎడారి ఎక్కువ భాగం రాజస్థాన్‌లో విస్తరించింది. దేశంలో పొడవైన హిమాలయ శ్రేణి హిమాద్రి. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని గోపాలకృష్ణ గోఖలే స్థాపించారు. ఇవీ 11/11/2026 నాటి ప్రశ్నలకు సమాధానాలు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రానికి రేపు పూజ
హీరో సిద్దు జొన్నలగడ్డ నటించనున్న కొత్త చిత్రం రేపు పూజా కార్యక్రమంతో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. సుకుమార్ రైటింగ్స్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బన్నీ వాస్ నిర్మిస్తుండగా, అశోక్ బండ్రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా వివరాలను సిద్దు స్వయంగా ఎక్స్‌లో పంచుకున్నారు.
Siddu Jonnalagadda's new film to launch with pooja tomorrow
Actor Siddu Jonnalagadda's new film will be launched with a pooja ceremony tomorrow, the film unit announced. The project is being made in partnership with Sukumar Writings, produced by Bunny Vas and directed by Ashok Bandreddy. Siddu shared the news about the film on X.
ఏపీపీఎస్సీ గ్రూప్-2: 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 కింద మొత్తం 720 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ విభాగంలో 471, నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 249 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే ప్రక్రియ ఈరోజు నుంచే మొదలైంది. నిరుద్యోగులు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరారు.
సెలవు కోసం కలెక్టర్‌కు విద్యార్థుల ఎమోషనల్ మెసేజ్‌లు
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం సెలవు ప్రకటించాలని కోరుతూ విద్యార్థులు కలెక్టర్ ఆనంద్ మోహన్‌కు వినూత్నంగా మెసేజ్‌లు పంపారు. సెలవు ఇవ్వకపోతే కలెక్టర్‌గా మీరు ఫెయిల్ అయినట్లేనని, తమకు ప్రమాదం జరిగితే బర్త్‌డే కాస్త డెత్‌డే అవుతుందంటూ కొందరు విద్యార్థులు పంపిన ఎమోషనల్ మెసేజ్‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Did you know? The Krishna river rises at Mahabaleshwar
The Krishna rises near Mahabaleshwar in Maharashtra, flows through Karnataka, Telangana and Andhra Pradesh and joins the Bay of Bengal. The Srisailam and Nagarjuna Sagar dams are built on this river.