15, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

ఉద్యోగాలు & విద్య

బీజేఆర్ డిగ్రీ కాలేజీలో గ్రంథాలయ వారోత్సవాలు షురూ

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
బీజేఆర్ డిగ్రీ కాలేజీలో గ్రంథాలయ వారోత్సవాలు షురూ

హైదరాబాద్ నారాయణగూడలోని బీజేఆర్ డిగ్రీ కాలేజీలో గ్రంథాలయ వారోత్సవాలను ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, లైబ్రేరియన్ వెంకట్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థుల మానసిక వికాసానికి లైబ్రెరీలు కేంద్రాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. కాలేజీలో 5 వేలకు మించిన పుస్తకాలతో పాటు డిజిటల్ వసతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వారం రోజులు వ్యాసరచన, పోస్టర్ ప్రజంటేషన్ పోటీలు జరిపి గెలిచినవారికి బహుమతులు అందజేస్తామన్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 14 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
బీజేఆర్ డిగ్రీ కాలేజీలో గ్రంథాలయ వారోత్సవాలు షురూ | Newsdash