17 ఏళ్ల బాలుడిలో గర్భాశయం.. పరిగి వైద్యుల అరుదైన ఆపరేషన్

వికారాబాద్ జిల్లా పరిగిలోని ఛత్రజీ ఆసుపత్రిలో 17 ఏళ్ల బాలుడి శరీరంలో ఉన్న గర్భాశయాన్ని వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తీసివేశారు. ఇది అరుదైన జన్యుపరమైన సమస్యగా వారు పేర్కొన్నారు. ఎంతో జాగ్రత్తగా ఈ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరగా కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →Wife held for slowly poisoning husband over Rs 8 crore assets
Police in Ghaziabad, Uttar Pradesh, arrested Renu Bhatnagar for allegedly poisoning her husband slowly over a period of time to grab his Rs 6 crore travel agency and Rs 2 crore insurance money. Suspicious of her behaviour, the husband underwent medical tests, which found poisonous substances in his body. He then lodged a complaint.
రూ.8 కోట్ల కోసం భర్తకు విషం.. భార్య అరెస్ట్
భర్త పేరిట ఉన్న రూ.6 కోట్ల ట్రావెల్ ఏజెన్సీ, రూ.2 కోట్ల బీమా సొమ్ము దక్కించుకోవాలని రేణు భట్నాగర్ అనే మహిళ కొంతకాలంగా అతడికి కొద్దికొద్దిగా విషం పెడుతూ వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. భార్యపై అనుమానం వచ్చిన భర్త వైద్య పరీక్షలు చేయించుకోగా ఒంట్లో విష పదార్థాలు బయటపడ్డాయి. అతడి ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Who are Gandhi's heirs in Congress, Bandi Sanjay asks CM
Union Minister Bandi Sanjay demanded that CM Revanth Reddy name the Gandhi heirs in the Congress. He alleged that Congress defeated Ambedkar twice and never gave him the Bharat Ratna. He asked why BLOs were not arrested if votes were deleted in the state, and criticised the government for failing to implement its promises.
కాంగ్రెస్‌లో గాంధీ వారసులెవరు: సీఎంను ప్రశ్నించిన బండి సంజయ్
కాంగ్రెస్‌లో గాంధీ వారసులుగా ఎవరు ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. అంబేడ్కర్ రెండుసార్లు ఓడిపోయేలా చేసిన కాంగ్రెస్, ఆయనకు భారతరత్న కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు జరిగితే బీఎల్ఓలను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
CM Revanth launches Cheyutha pensions for 4.72 lakh new beneficiaries
CM Revanth Reddy launched the distribution of new 'Cheyutha' pensions to 4.72 lakh newly selected beneficiaries at a meeting in Achampet, Nagarkurnool district, on Constitution Day. Money is being credited directly to their bank accounts, with general category beneficiaries receiving Rs 2,000 a month. The total number of beneficiaries in the state has now crossed 52 lakh.
4.72 లక్షల మందికి చేయూత పింఛన్లు ప్రారంభించిన సీఎం రేవంత్
చేయూత పథకంలో కొత్తగా ఎంపికైన 4.72 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాజ్యాంగ దినోత్సవం రోజున నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన సభలో ఈ కార్యక్రమం చేపట్టారు. సాధారణ వర్గాల వారికి నెలకు రూ.2,000 చొప్పున డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పింఛనుదారుల సంఖ్య 52 లక్షలు దాటింది.