నగరంలో ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్, ప్రజల తరలింపు

కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ బ్లో అవుట్ జరిగింది. ఓఎన్జీసీ రీడ్రిల్లింగ్ పాయింట్ నుంచి సీఎన్జీ బయటకు రావడంతో స్థానికులు భయాందోళన చెందారు. గ్యాస్ సమీప గ్రామాలకు వ్యాపిస్తుండటంతో అధికారులు ఘటనాస్థలికి చేరుకుని లీక్ అరికట్టే చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. మంటలు అంటుకోకుండా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Gas blowout at ONGC well in Nagaram, residents evacuated
A gas blowout occurred early Tuesday at an ONGC redrilling point in Nagaram village of Mamidikuduru mandal, Konaseema district, as CNG began leaking. With the gas spreading to nearby villages, officials rushed to the site to contain the leak and began evacuating residents. Fire personnel are working to prevent flames at the well.
10 arrested for attack on Sarpanch aspirant in Sundupalle
Police arrested 10 accused for attacking Golla Reddeppa (27) with sticks and stones as he was going to file his Sarpanch nomination at Sundupalle in Kadapa district. He suffered injuries to both legs, left shoulder and right hand.
సుండుపల్లెలో సర్పంచ్ అభ్యర్థిపై దాడి.. 10 మంది అరెస్ట్
కడప జిల్లా సుండుపల్లెలో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి బయల్దేరిన గోళ్ల రెడ్డెప్ప (27)పై దుండగులు కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. దాడిలో ఆయన రెండు కాళ్లు, ఎడమ భుజం, కుడి చేతికి గాయాలయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు పెట్టి 10 మంది నిందితులను పట్టుకున్నారు. ఇన్నోవా, బొలెరో వాహనాలను సీజ్ చేశారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు దెబ్బతీస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-2: 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2 కింద మొత్తం 720 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ విభాగంలో 471, నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 249 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రక్రియ ఈరోజు నుంచే మొదలైంది. నిరుద్యోగులు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరారు.