Four killed as lorry hits Tufan vehicle near Rayalacheruvu

Four people died after a lorry rammed a Tufan vehicle near Rayalacheruvu in Yadiki mandal of Anantapur district. The victims were heading back to Tadipatri after attending a wedding in Hyderabad. The injured were shifted to a nearby hospital, where they are receiving treatment.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →FCC clears SpaceX to launch 10 lakh satellites
The US Federal Communications Commission (FCC) has granted SpaceX approval to launch 10 lakh (one million) satellites. The satellites are meant to help build data centres in space. SpaceX became the first company worldwide to receive such a permission. The project has been named 'Starmind'.
స్పేస్‌ఎక్స్‌కు 10 లక్షల ఉపగ్రహాల ప్రయోగానికి ఎఫ్‌సీసీ ఓకే
స్పేస్‌ఎక్స్ సంస్థ 10 లక్షల ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ (ఎఫ్‌సీసీ) అనుమతి ఇచ్చింది. అంతరిక్షంలో డేటా సెంటర్లు నెలకొల్పేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. ఇలాంటి అనుమతి పొందిన మొదటి కంపెనీగా స్పేస్‌ఎక్స్ గుర్తింపు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టుకు ‘స్టార్‌మైండ్’ అనే పేరు ఖరారు చేశారు.
CM Chandrababu and family cast votes in Undavalli
AP CM Chandrababu cast his vote in Undavalli in the Mangalagiri-Tadepalli Municipal Corporation elections along with his wife Nara Bhuvaneswari, Minister Nara Lokesh and Brahmani. Speaking to the media later, he urged every responsible citizen to exercise their right to vote, saying democracy grows stronger when people can elect the person they prefer.
ఉండవల్లిలో ఓటేసిన సీఎం చంద్రబాబు కుటుంబం
మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాధ్యతగల ప్రతి పౌరుడూ ఓటు వేయాలని చంద్రబాబు మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ఇష్టమైన వ్యక్తిని ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని ఆయన అన్నారు.
Rs 25,000 per vote allegedly paid in Ayyalurivaripalli
A candidate backed by a party in Ayyalurivaripalli, C.S. Puram mandal, Markapuram district, is said to have paid Rs 25,000 per vote in the sarpanch contest. A party rebel reportedly gave Rs 20,000 and another party's supporter Rs 15,000 per vote. Three candidates are vying for the OC General seat. The village has 841 voters.
అయ్యలూరివారిపల్లిలో ఓటుకు రూ.25 వేలు ఇచ్చినట్లు ప్రచారం
మార్కాపురం జిల్లా సి.ఎస్.పురం మండలం అయ్యలూరివారిపల్లి సర్పంచి ఎన్నికలో ఓ పార్టీ మద్దతు ఉన్న అభ్యర్థి ఒక్కో ఓటరుకు రూ.25 వేలు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఓ పార్టీ రెబల్ అభ్యర్థి రూ.20 వేలు, మరో పార్టీ మద్దతుదారు రూ.15 వేలు చొప్పున పంచినట్లు తెలిసింది. ఓసీ జనరల్‌కు కేటాయించిన ఈ పదవికి ముగ్గురు బరిలో ఉన్నారు. గ్రామంలో 841 మంది ఓటర్లు ఉన్నారు.