Trains help Hyderabad commuters save 2 hours a day

Suburban rail services and express trains halting at major stations are emerging as an answer to Hyderabad's growing road congestion. Over 80 local and suburban services now operate in the city, while intercity and express trains sharply cut travel time. With tickets under Rs.50, commuters avoid traffic and save at least 2 hours daily.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Deputy mayors, vice chairpersons to be elected in AP today
Deputy mayors and municipal vice chairpersons will be elected today at the first meetings of 13 corporations and 87 municipalities across Andhra Pradesh. The alliance parties have finalised the sharing of posts, with TDP getting 66, Janasena 23 and BJP 9 positions.
నేడు డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్పర్సన్ల ఎన్నిక
ఏపీలోని 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో ఇవాళ జరిగే మొదటి సమావేశాల్లో డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ల ఎన్నిక చేపట్టనున్నారు. ఈ పదవుల పంపకంపై కూటమి పార్టీలు అవగాహనకు వచ్చాయి. ఒప్పందం ప్రకారం టీడీపీకి 66, జనసేనకు 23, బీజేపీకి 9 స్థానాలు దక్కనున్నాయి.
హైదరాబాద్‌లో రైళ్లతో రోజుకు 2 గంటలు ఆదా
హైదరాబాద్‌లో వాహనాల రద్దీతో విసిగిన ప్రయాణికులకు సబర్బన్ నెట్వర్క్, ప్రధాన స్టేషన్లలో ఆగే ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉపశమనం ఇస్తున్నాయి. నగరంలో ఇప్పుడు 80కిపైగా లోకల్, సబర్బన్ సర్వీసులు నడుస్తున్నాయి. ఇంటర్సిటీ, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతోంది. రూ.50లోపు టికెట్‌తో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రోజుకు కనీసం 2 గంటలు మిగులుతున్నాయి.
Kokya Thanda youth lands Rs 1.50 crore job with US software firm
Subhash Chandra Sai of Kokya Thanda in Kusumanchi mandal, Khammam district, has been selected by US software firm Global Tech Solutions at an annual salary of Rs 1.50 crore. After his BTech at Lovely Professional University, Jalandhar, he turned down a Rs 17 lakh campus offer, did his MS in the US and secured the job within a year.
కోక్యాతండా యువకుడికి అమెరికాలో రూ.1.50 కోట్ల ఉద్యోగం
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన సుభాష్చంద్రసాయి అమెరికాలోని గ్లోబల్ టెక్ సొల్యూషన్స్ సంస్థలో ఏటా రూ.1.50 కోట్ల వేతనంతో కొలువు సాధించాడు. జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ చదివిన అతడు, క్యాంపస్‌లో రూ.17 లక్షల ప్యాకేజీ ఆఫర్‌ను వదులుకుని అమెరికాలో ఎంఎస్ పూర్తిచేశాడు. ఏడాది తిరగకముందే ఈ అవకాశం దక్కింది.
ఏపీపీఎస్సీ గ్రూప్-2: 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 కింద మొత్తం 720 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ విభాగంలో 471, నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 249 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రక్రియ ఈరోజు నుంచే మొదలైంది. నిరుద్యోగులు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరారు.