శ్రీవారి చిత్రకారుడు శ్రీనివాసన్ (86) మృతి

తిరుమల వేంకటేశ్వర స్వామి రూపాన్ని చిత్రంగా మలిచిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసన్ (86) వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. తమిళనాడు కోవిల్పట్టికి చెందిన ఈయన 1970లో టీటీడీ పిలుపుతో గర్భాలయ మూలవిరాట్టును స్వయంగా చూసి చిత్రించారు. ఆభరణాలతో, ఆభరణాలు లేని రెండు చిత్రాలు టీటీడీ అనుమతితో క్యాలెండర్లు, ఫొటోలుగా ప్రపంచమంతటా చేరాయి. భక్తులు సంతాపం తెలిపారు.
✓ Verified