Bandi Sanjay invited to Yellamma temple fete at Yellareddypet

Gouda Sangham leaders invited Union Minister of State for Home Bandi Sanjay Kumar to the Yellamma temple consecration and Siddhogam celebrations to be held at Yellareddypet in Rajanna Sircilla district. Ganta Balakrishna Goud, Srihari, Pandirla Sattaiah and others handed him the invitation card. The minister responded positively, saying he would attend.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Snapped power lines near Piduguralla disrupt train services
Electric wires snapped and fell on the railway track near Piduguralla in Palnadu district, severely disrupting train movement. The Sabari Express was held up for about one and a half hours, leaving passengers in distress. Several trains running on the Secunderabad–Guntur route are running late due to the disruption.
పిడుగురాళ్ల వద్ద తెగిన విద్యుత్ వైర్లు.. రైళ్లకు బ్రేక్
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో కరెంటు తీగలు తెగి రైలు పట్టాలపై పడ్డాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు భారీగా స్తంభించాయి. శబరి ఎక్స్‌ప్రెస్ దాదాపు గంటన్నర సేపు ఆగిపోవడంతో అందులోని ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ అంతరాయం వల్ల సికింద్రాబాద్–గుంటూరు రూట్లోని అనేక రైళ్లు నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి.
Sabarimala temple to open on November 16, arrangements ready
The Sabarimala temple will open at 4 pm on November 16 for the Mandala-Makaravilakku season. Travancore Devaswom Board president K. Jayakumar said all arrangements are in place to ensure pilgrims get a hassle-free darshan. Additional counters have been set up for Aravana prasadam distribution, along with rest and accommodation facilities for devotees.
శబరిమల ఆలయం నవంబర్ 16న ప్రారంభం.. ఏర్పాట్లు సిద్ధం
మండల-మకరవిళక్కు సీజన్ సందర్భంగా శబరిమల ఆలయాన్ని నవంబర్ 16న సాయంత్రం 4 గంటలకు తెరవనున్నారు. భక్తులు సాఫీగా దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ వెల్లడించారు. అరవణ ప్రసాదం అందించేందుకు అదనపు కౌంటర్లు నెలకొల్పారు. యాత్రికుల కోసం విశ్రాంతి, వసతి సదుపాయాలు కూడా కల్పించారు.
Tharoor slams Centre over visa cancellation of 115 foreign speakers
Congress MP Shashi Tharoor criticised the Centre for denying permission to 115 foreign speakers due at the Bharat Summit in Hyderabad. He alleged that though the External Affairs Ministry cleared 315, their visas were cancelled on Home Ministry orders. On X, he demanded to know under which law this was done, calling such insecurity shameful for the world's largest democracy.
115 మంది విదేశీ వక్తల వీసాల రద్దుపై థరూర్ ఆగ్రహం
హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌కు రావాల్సిన 115 మంది విదేశీ వక్తలను కేంద్రం అడ్డుకుందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ధ్వజమెత్తారు. విదేశాంగ శాఖ 315 మందికి ఓకే చెప్పినప్పటికీ, హోం శాఖ ఆదేశాలతో వారి వీసాలు రద్దయ్యాయని ఆరోపించారు. ఏ చట్టం కింద ఈ చర్య తీసుకున్నారో వెల్లడించాలని ఎక్స్‌లో డిమాండ్ చేశారు. విమర్శలంటే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ఇంత అభద్రత సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.